ఈ రేర్ మార్క్ దిశగా “ఉప్పెన”.?

Published on Feb 23, 2021 3:01 pm IST

ఈ కొత్త ఏడాదితో ప్రపంచం అంతా కాస్త హీల్ అవుతూ వస్తుంది ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమకు అయితే శుభారంభమే దక్కింది. అయితే ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో భారీ హిట్ గా నిలిచిన వాటిలో “ఉప్పెన” కూడా ఒకటి. మెగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఈ డెబ్యూ చిత్రం ఇండియాలోనే చాలా రికార్డులను బద్దలు కొట్టింది.

ఓ డెబ్యూ చిత్రం కొన్ని మైల్ స్టోన్స్ ను టచ్ చేసిన ఈ చిత్రం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకో రేర్ రికార్డు నెలకొల్పడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికీ కూడా స్ట్రాంగ్ వసూళ్లను రాబడుతున్న ఈ చిత్రం ఫైనల్ రన్ లో ఖచ్చితంగా 50 కోట్ల షేర్ మార్క్ ను అందుకుంటుంది అని తెలుస్తుంది. ఇదే కనుక జరిగితే ఆ మార్క్ ను టచ్ చేసిన ఓ డెబ్యూ సినిమాగా మరియు డెబ్యూ హీరోగా వైష్ణవ తేజ్ నిలుస్తాడు. మరి ఈ సినిమా ఈ మార్క్ ను అందుకుంటుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :