ఓటీటీలోకి ఉప్పెన రాబోతోందా ?

Published on Nov 28, 2020 6:00 pm IST

టాలీవుడ్ లో ప్రస్తుతం సినిమాల షూటింగ్స్ మళ్లీ మొదలై ఫుల్ బిజీగా షూట్ జరుపుకుంటున్నా.. ఆ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేది ఇంకా క్లారిటీ లేదు. థియేటర్ల ఓపెనింగ్ పై క్లారిటీ వచ్చినా.. థియేటర్లకు జనం వస్తారని గ్యారంటీ లేకుండా పోయింది. అందుకే చిన్న సినిమాలను ఓటిటీలో రిలీజ్ చేసుకోవడమే బెటర్ అని ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినా ఓటిటీ ప్లాట్ ఫామ్ లో డైరెక్ట్ రిలీజ్ కి మాత్రం ఆయా సినిమాల మేకర్స్ అంగీకరించట్లేదట. అయితే తాజాగా ఉప్పెన సినిమాని ఓటిటీలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి. ఇప్పటికే నిశ్శబ్దం, ఒరేయ్ బుజ్జిగా, ఆకాశమే హద్దుగా లాంటి సినిమాలు రిలీజ్ అయిపోయాయి. ఈ క్రమంలోనే కొన్ని సినిమాలను ఓటిటీలో డైరెక్ట్ రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారట. కాస్త స్టార్ ప్యాడింగ్ ఉన్న సినిమాలకు ఎలాగూ ఓటిటీ ప్లాట్ ఫాన్స్ లో మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి.. రామ్ రెడ్, విజయ్ మాస్టర్ లాంటి సినిమాలకు ఓటిటీలో మంచి డిమాండ్ ఉంటుంది.

సంబంధిత సమాచారం :

More