రానా – సాయిప‌ల్ల‌వి సినిమా లేటెస్ట్ అప్ డేట్ !

Published on Jun 10, 2019 9:29 am IST

‘నీది నాది ఒకే కథ’ చిత్రంతో విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు ‘వేణు ఉడుగుల’, కాగా ఈ దర్శకుడు తన రెండో చిత్రంగా రానా, సాయిప‌ల్ల‌విలను హీరోహరోయిన్ లుగా పెట్టి ‘విరాటపర్వం’ అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే.

పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌ ప్రియమణి కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జులై నుండి షూట్ కి వెళ్ళనుంది. కాగా ఈ చిత్రంలో ఓ కీల‌క‌మైన పాత్ర‌లో ట‌బు నటించనున్నట్లు తెలుస్తోంది. ట‌బు మాన‌వ హ‌క్కుల నేత‌గా నటిస్తోందట.

ఈ సినిమాను హిందీ, తమిళ భాష‌ల్లోనూ విడుద‌ల చేస్తున్నారు. ఇక వేణు ‘నీది నాది ఒకే కథ’ చిత్రంలో కూడా హీరో క్యారెక్టర్ మీదే చిత్రాన్ని నడిపించాడు. అలాగే ఈ సినిమానూ రానా క్యారెక్టర్ పైనే నడుపుతాడట.

రానా పాత్రలో కొంత నెగిటివ్ యాంగిల్ ఉంటుందని అది సినిమాలో కొత్తగా అనిపిస్తోందని దర్శకుడు ఫీల్ అవుతున్నాడట. ఇకపోతే ఇందులో ఇతర తారాగణం, సాంకేతిక నిపుణులు ఎవరనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More