ఊర్వశీ రౌతేల “బ్లాక్ రోజ్” ప్రమోషనల్ సాంగ్ కి ఊహించని రెస్పాన్స్!

Published on Sep 30, 2020 9:04 pm IST

మిస్ ఇండియా ఊర్వశీ రౌతేల హీరోయిన్ గా సంపత్ నంది క్రియేషన్స్ లో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ ఎమోషనల్ థ్రిల్లర్ బ్లాక్ రోజ్ ప్రమోషనల్ సాంగ్ విడుదల అయింది. ఈ పాట కి ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తోంది. ప్రొడక్షన్ నంబర్ 4 గా బ్లాక్ రోజ్ సినిమా ను తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదల అయిన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కి విశేష స్పందన లభించిన సంగతి తెలిసిందే. అయితే నేడు నా తప్పు ఎమున్నదబ్బా అంటూ ప్రమోషనల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. సంగీత దర్శకుడు థమన్ ఈ రోజు సాయంత్రము 04:24 గంటలకు విడుదల చేశారు. సోనీ మ్యూజిక్ ద్వారా ఈ పాట విడుదల అయింది.

ఈ ప్రమోషనల్ సాంగ్ లో హీరోయిన్ తన అందంతో పాటుగా, అధ్బుతమైన డ్యాన్స్ తో విశేషంగా ఆకట్టుకున్నారు. అయితే నాలుగు రోజుల పాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ పాటకి కానీ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేయడం జరిగింది. స్వతహాగా డ్యాన్సర్ కావడంతో కష్టమైన డ్యాన్స్ మూవ్ మెంట్స్ తో అలరించడం విశేషం అని చెప్పాలి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టైల్ స్టెప్పులు స్ఫూర్తి గా తీసుకొని కంపోజ్ చేసిన డ్యాన్స్ కి కొన్ని సార్లు గాయపడినా, నేర్చుకొని డ్యాన్స్ చేయడం పట్ల తన డెడికేషన్ ఎంటో అర్దం అవుతుంది. ఈ పాట ప్రేక్షకులకు ఒక ట్రీట్ ల ఉండనుంది.

అయితే హీరోయిన్ ఊర్వశీ రౌతేల పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు డ్యాన్స్ అంటే ఇష్టం అని, డ్యాన్స్ లో ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు తెలిపారు. బ్లాక్ రోజ్ తనకు ఒక ప్రత్యేక చిత్రం అని, ఈ సినిమా లో నటిగా ఇంకో కోణాన్ని ఆవిష్కరించే అవకాశం ఇవ్వడం మాత్రమే కాకుండా కష్టమైన డ్యాన్స్ నేర్చుకొనే అవకాశం వచ్చింది అని తెలిపారు. ఈ పాట షూట్ చేయడానికి చాలా రిహార్సల్స్ చేశా అని, దెబ్బలు కూడా తగిలాయి అని, కానీ పాట పూర్తి అయ్యాక, చూసినప్పుడు కష్టం అంతా కూడా మర్చిపోయినట్లు తెలిపారు. పాట అద్భుతంగా వచ్చింది అని, ఆడియెన్స్ ఎప్పుడెప్పుడు చూస్తారా అని వెయిట్ చూస్తున్నా అని, ఈ అవకాశం ఇచ్చిన సంపత్ నంది కి, శ్రీనివాస చిట్టూరు గారికి కృతజ్ఞతలు అని అన్నారు.

అయితే మణిశర్మ కంపోజ్ చేసిన ఈ పాటను తెలుగు మరియు హిందీ భాషలలో హారిక నారాయణ్ పాడగా, సంపత్ నంది రాశారు. హిందీ వెర్షన్ వనిత గుప్తా రాశారు. షేక్స్ పియర్ రచించిన ద మర్చంట్ ఆఫ్ వెనిస్ లో షైలాక్ అనే పాత్ర ఆధారం గా చేసుకొని ఫిమేల్ ఓరియెంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్ గా బ్లాక్ రోజ్ తెరకెక్కుతోంది.

సంబంధిత సమాచారం :

More