రేపే ‘ఉత్తమ విలన్’ తెలుగు టీజర్

రేపే ‘ఉత్తమ విలన్’ తెలుగు టీజర్

Published on Mar 18, 2015 4:20 PM IST

Uttama-Villain
సినిమా సినిమాకి నటనలోనే కాకుండా కథల విషయంలో కూడా సరికొత్త ఐడియాలతో ప్రేక్షకులను మెప్పించే స్టార్ హీరో ఉలగనాయగన్ కమల్ హాసన్. కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఉత్తమ విలన్’. ఈ సినిమా తమిళ ఆడియో లాంచ్ ఇటీవలే చెన్నైలో జరిగింది. ఇప్పటికే తమిళంలో ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు. కానీ ఇప్పటి వరకూ తెలుగులో టీజర్ మరియు పోస్టర్స్ ని రిలీజ్ చేయలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం రేపు ఈ సినిమా ఫస్ట్ టీజర్ ని తెలుగులో రిలీజ్ చేయనున్నారు. దీనితో పాటు టైటిల్ ఫస్ట్ లుక్ ని కూడా రివీల్ చేస్తారు.

కమల్ హాసన్ హీరోగానే కాకుండా కథ – స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకి రమేష్ అరవింద్ డైరెక్టర్. ఒక సినీ నటుడు జీవితం చుట్టూ తిరిగే ఈ కథలో రియల్ లైఫ్ మూవీ లెజెండ్స్ అయిన బాల చందర్, కె.విశ్వనాధ్ లు నటించారు. కమల్ హాసన్ సరసన పూజ కుమార్, ఆండ్రియా జెరెమియా హీరోయిన్స్ గా నటించారు. జిబ్రాన్ మ్యూజిక్ అందించిన ఈ ఆల్బంలో మొత్తం 16 ట్రాక్స్ ఉన్నాయి. ఇప్పటికే ఈ పాటలకి తమిళంలో సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాని ఏప్రిల్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు