తమ్మారెడ్డి ముఖ్య అతిధిగా “ఉత్తర” ట్రైలర్ లాంచ్

Published on Jul 21, 2019 3:00 am IST

లైవ్ ఇన్ సి క్రియేషన్స్, గంగోత్రి ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఉత్తర’. శ్రీరామ్, కారుణ్య కత్రేన్ హీరో హీరోయిన్లుగా దర్శకుడు తిరుపతి యస్ ఆర్ రోమాంటిక్ క్రైమ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఐతే నేడు ఈ మూవీ ట్రైలర్ ని ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది.

పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ మూవీ కథ,కథనాలు చాలా కొత్తగా ఉంటాయని అంటున్న చిత్ర బృందం మూవీ విజయం పై ఆశాభావం వ్యక్తం చేశారు.హీరో,హీరోయిన్ దర్శక నిర్మాతలతో పాటు,మూవీ క్రిటిక్ కత్తి మహేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేసారు.

సంబంధిత సమాచారం :

More