యూటర్న్ 3రోజుల కలక్షన్స్ !

యూటర్న్ 3రోజుల కలక్షన్స్ !

Published on Sep 16, 2018 6:52 PM IST

Uturn
పవన్ కుమార్ దర్శకత్వంలో సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘యూటర్న్’. సెప్టెంబర్ 13న విడుదలైనా ఈ చిత్రం పాజిటివ్ రివ్యూస్ ను దక్కించుకుంది. ఇక ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ రాబడుతుంది. 3రోజులకుగాను ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 14కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకులను నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈచిత్రానికి ఈ సోమవారం నుండి అసలైన పరీక్ష ఎదురుకానుంది.

అటు ఓవర్శిస్ లో కూడా ఈచిత్రం మంచి వసూళ్లనే రాబడుతుంది. కన్నడలో విజయం సాధించిన ‘యూటర్న్’ చిత్రానికి రీమేక్ గా రూపొందిన ఈ చిత్రంలో భూమిక, ఆది పినిశెట్టి , రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు