పవన్ కుమార్ దర్శకత్వంలో సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘యూటర్న్’. సెప్టెంబర్ 13న విడుదలైనా ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 6.5కోట్ల వసూళ్లను సాధించి బాక్సాఫిస్ వద్ద రన్ ను ముగించింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఏ సెంటర్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకోగా బి ,సిసెంటర్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈచిత్రం బ్రేక్ ఈవెన్ ను చేరుకోలేకపోయింది. ఈచిత్రం యొక్క 9కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని సమాచారం.
భూమిక, ఆది పినిశెట్టి ముఖ్య పాత్రల్లో నటించిన ఈచిత్రం 2016లో కన్నడ లో విజయం సాధించిన ‘యూటర్న్’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది. ఇక ఈ చిత్రం తరువాత సమంత ఆమె భర్త నాగ చైతన్య తో కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో నటించనుంది.


