వాథి వాథి : ఇన్స్టంట్ హిట్ గా ధనుష్ వర్షన్ సాంగ్

Published on Feb 23, 2023 5:13 pm IST

ధనుష్ హీరోగా యువ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన లేటెస్ట్ మెసేజ్ ఓరియెంటెడ్ యాక్షన్ డ్రామా మూవీ వాథి. ద్విభాషా మూవీగా రూపొంది తెలుగులో సార్ టైటిల్ తో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రస్తుతం రెండు భాషల ఆడియన్స్ యొక్క మెప్పుతో భారీ కలెక్షన్స్ తో దూసుకెళుతోంది. శ్రీకర స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై నాగవంశీ, సాయి సౌజన్య ఎంతో భారీ స్థాయిలో నిర్మించిన వాథి మూవీకి జివి ప్రకాష్ కుమార్ అందించిన సాంగ్స్ కూడా అందరినీ ఎంతో అలరించాయి.

ముఖ్యంగా వాథి వాథి అంటూ సాగే మెలోడియస్ సాంగ్ అయితే యువతని విశేషంగా ఆకట్టుకుంది. కాగా ఈ సాంగ్ ని ధనుష్ తనదైన స్టైల్ లో అద్భుతంగా పాడిన వర్షన్ ని కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసారు మేకర్స్. కాగా ఒరిజినల్ వర్షన్ ని మించేలా ధనుష్ పాడిన ఈ సాంగ్ ప్రస్తుతం ఇన్స్టంట్ హిట్ గా నిలిచి అందరినీ ఆకట్టుకుంటూ మంచి వ్యూస్ తో దూసుకెళుతోంది. మొత్తంగా తమ సినిమాని అలానే సాంగ్స్ ని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానులకి యూనిట్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెపుతోంది.

సంబంధిత సమాచారం :