అల్లు అర్జున్, ‘పుష్ప’ పై వడ్డే నవీన్ కామెంట్స్ వైరల్!

అల్లు అర్జున్, ‘పుష్ప’ పై వడ్డే నవీన్ కామెంట్స్ వైరల్!

Published on Jun 11, 2026 11:32 AM IST

ఒకప్పటి ఫ్యామిలీ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోస్ లో వడ్డే నవీన్ కూడా ఒకరు. తనదైన ఎమోషనల్ ఎంటర్టైనర్ సినిమాలతో అలరించిన వడ్డే నవీన్ కొన్నాళ్ల పాటు సినిమా కెరీర్ కి బ్రేక్ తీసుకుని ఇప్పుడు ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. అయితే సినిమా కోసం ఎంతో ఎనర్జిటిక్ గా వర్క్ చేసిన తాను ఇప్పుడు అదే రీతిలో ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు.

మరి ఈ ప్రమోషన్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. గత పదేళ్లలో మాత్రం అల్లు అర్జున్ ఎదుగుదల అద్భుతం అని తెలిపారు. అయితే బాహుబలి సినిమా ఫలితం ఊహించిందే ఎందుకంటే ఆ స్కేల్ వేరు కాబట్టి.. కానీ పుష్ప సినిమాకి అలా కాదు ఆ సినిమా సృష్టించిన సెన్సేషన్ ఒక్కసారిగా అల్లు అర్జున్ కి పాన్ ఇండియా లెవెల్లో దక్కిన ఆదరణ కోసం తాను ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక తన రీఎంట్రీ సినిమా ఈ జూన్ 19న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు