మ్యాచ్ ఉన్నా సాలిడ్ టీఆర్పీ అందుకున్న “వకీల్ సాబ్”.!

Published on Jul 29, 2021 12:01 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్”. దాదాపు మూడున్నర ఏళ్ళు తర్వాత పవన్ నుంచి వచ్చిన కం బ్యాక్ సినిమా ఇది. భారీ అంచనాలతో విడుదల కాబడిన ఈ చిత్రంను దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ చిత్రం గత ఏప్రిల్ నెలలో రిలీజ్ అయ్యి కేవలం 14 రోజులు మాత్రమే థియేటర్స్ లో ఉంది.

మరి ఆ తర్వాత ప్రైమ్ వీడియోలో కూడా త్వరగానే వచ్చేసిన ఈ చిత్రం గత వారం జీ తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా భారీ ప్రమోషన్స్ తో టెలికాస్ట్ అయ్యింది.మరి ఇప్పుడు ఈ చిత్రం ఎంత రేటింగ్ సంపాదించిందో లెక్క బయటకి వచ్చింది. ఆ రోజు ఇండియా క్రికెట్ మ్యాచ్ ఎఫెక్ట్ తో కూడా ఈ చిత్రం ఫస్ట్ టైం టెలికాస్ట్ కి గాను 19.12 సాలిడ్ రేటింగ్ ను రాబట్టినట్టు తెలిసింది.

మన టాలీవుడ్ లో మరియు పవన్ కెరీర్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ మరియు బెస్ట్ గా వచ్చింది అని చెప్పాలి. మరి బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ కి రీమేక్ గా తెరకెక్కించిన ఈ చిత్రంలో అనన్య నాగళ్ళ, అంజలి మరియు నివేతా థామస్ లు కీలక పాత్రల్లో నటించగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. అలాగే థమన్ సంగీతం అందించిన ఈ చిత్రంకి పవన్ ఫ్యాన్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :