“వకీల్ సాబ్” తమిళ్ రిలీజ్ కి రెడీ అవుతుందా.?

Published on Jul 24, 2021 4:25 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్”. శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ చిత్రం కొన్ని నెలల కితమే విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బాలీవుడ్ హిట్ చిత్రం “పింక్” కి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం సందేశంతో పాటుగా పవన్ మార్క్ ఎలివేషన్స్ తో కూడా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది.

మరి ఈ సినిమా అప్పుడు అందుకున్న రెస్పాన్స్ తో చాలా మంది హిందీ మరియు తమిళ ఆడియెన్స్ కూడా తమ వెర్షన్ డబ్బింగ్ లో కావాలని డిమాండ్ చేసారు. అయితే ఇప్పుడు ఈ చిత్రం తమిళ్ ఆడియెన్స్ ని అలరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ చిత్రం తాలూకా తమిళ్ డబ్ రైట్స్ ని విజయ్ టీవీ వారు కొనుగోలు చేసి ఆల్రెడీ డబ్బింగ్ చేసి సెన్సార్ ని కూడా పూర్తి చేసినట్టు తెలుస్తుంది.

సో ఈ చిత్రం అక్కడ స్మాల్ స్క్రీన్ పైనే రిలీజ్ కావొచ్చని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో నివేతా థామస్, అనన్య నాగళ్ళ, అలాగే అంజలిలు కీలక పాత్రల్లో నటించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే దిల్ రాజు ఈ సినిమాకి నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :