‘వకీల్ సాబ్’ చెక్ చేస్తారట

Published on Mar 29, 2020 8:00 pm IST

కరోనా ఎఫెక్ట్ లేకుండా ఉంటే పవన్ కళ్యాణ్ యొక్క ‘వకీల్ సాబ్’ చిత్రం ఈపాటికి పూర్తయ్యేది. కానీ లాక్ డౌన్ కారణంగా 80 శాతం వద్ద ఆగిపోయింది షూటింగ్. లాక్ డౌన్ ముగియగానే షూట్ రెజ్యూమ్ చేయాలని టీమ్ భావిస్తోంది. అయితే ఈ లాక్ డౌన్ సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారట టీమ్. అందుకోసం ఇప్పటివరకు పూరైన చిత్రాన్ని ఎడిటింగ్ చేస్తున్నారట.

పైగా పవన్ సైతం ఇప్పటివరకు సినిమా ఎలా వచ్చిందో చూడాలని కోరినట్టు అందుకే టీమ్ ఎడిటింగ్ కానిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు వీలుంటే ఇంట్లోనే పవన్ డబ్బింగ్ చెప్పే అవకాశం కూడా ఉందట. మొత్తానికి చిత్ర బృందం వీలైనంతవరకు రిలీజ్ డేట్ ఎక్కువ రోజులు వాయిదాపడకుండా ఉండేలా చూస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More