“వకీల్ సాబ్” టీం ఇక స్పీడ్ పెంచాల్సిందేనా.?

Published on Mar 2, 2021 10:00 am IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “వకీల్ సాబ్” విడుదలకు రెడీ అయ్యిన సంగతి తెలిసిందే. చాన్నాళ్ల తర్వాత పవన్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాకు భయారీ స్థాయిలోనే స్ట్రీమింగ్ మరియు థియేట్రికల్ బిజినెస్ ను పూర్తి చేసుకుంది.

కానీ ఇంకా థియేట్రికల్ విడుదల విషయంలో మాత్రం ఒక్క ఫ్యాన్స్ నుంచి తప్ప మిగతా హైప్ అంతగా కనిపించడం లేదనే చెప్పాలి. ఎంత పవన్ కం బ్యాక్ సినిమా అయినా రీమేక్ కావడంతో ఒకింత అభిమానుల్లో కూడా అంత ఆసక్తి ఈ సినిమాపై మొదటి నుంచి లేదు. దీనికి ఉదాహరణగా వకీల్ సాబ్ టీజర్ రెస్పాన్స్ నే చెప్పుకోవచ్చు. దీనికి ఇప్పుడు ఉన్న ఏకైక మార్గం ప్రమోషన్స్..

కాస్త స్పెషల్ గా కానీ ఈ సినిమాపై ప్లాన్ చేస్తే వచ్చే నెల నాటికి ఖచ్చితంగా మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను కానీ కాస్త గ్రాండ్ గా సెట్ చేస్తే ఆ హైప్ అప్పటికి వచ్చేస్తుంది అది వేరే విషయం. కానీ మేకర్స్ మాత్రం ఇక నుంచి స్పీడ్ పెంచాల్సిందే అని చెప్పాలి. ఆల్రెడీ థమన్ మ్యూజికల్ మార్చ్ కోసం గట్టిగా కష్టపడుతున్నాడు. మరి ఇది ఎంత వరకు ప్లస్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :