దర్శకుడికి అన్ని విధాలా సహకరిస్తున్న అల్లు అర్జున్ !
Published on Nov 26, 2017 11:52 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రసుతం ‘నా పేరు సూర్య’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంతో రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వంశీకి ఈ చిత్రం మొదటిదే అయినప్పటికీ చాలా అనుభవంగాల సీనియర్ దర్శకుడిలా చాలా జాగ్రత్తగా, కాన్ఫిడెంట్ గా షూటింగ్ చేస్తున్నారని యూనిట్ చెబుతున్నారు.

అయితే తన కాన్ఫిడెన్స్ కు కారణం అల్లు అర్జునేనని, ఆయన అన్ని విధాలా సహకరిస్తూ, మంచి సపోర్ట్ అందిస్తున్నారని వక్కంతం వంశీ చెప్పుకొచ్చారు. ఈ చిత్రం కోసం బన్నీ సరికొత్త లుక్ ను ట్రై చేస్తున్నారు. అంతేగాక ఇటీవలే షూట్ చేసిన భారీ యాక్షన్ సన్నివేశాన్ని కూడా ఆయన డూప్స్ లేకుండా చేశారని వినికిడి. యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్, బొమన్ ఇరాని వంటి సీనియర్ స్టార్ నటులు నటిస్తున్న ఈ ప్రాజెక్టును శిరీష, శ్రీధర్ లగడపాటి, బన్నీ వాసులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

 
Like us on Facebook