వలిమై ఆడియో రైట్స్ ను సొంతం చేసుకున్న సోని మ్యూజిక్!

Published on Jul 16, 2021 12:11 am IST

అజిత్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా హెచ్. వినోత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం వలిమై. ఈ చిత్రం కి సంబంధించిన మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ తాజాగా విడుదల అయిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రం కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మరొకటి బయటికి వచ్చింది. ఈ చిత్రం ఆడియో రైట్స్ ను సోనీ మ్యూజిక్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోని మ్యూజిక్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించడం జరిగింది.

బోని కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సంగీతం యువన్ శంకర్ రాజా అందిస్తున్నారు. ఈ చిత్రం లో కార్తికేయ, హూమ కురేశి, యామి గౌతమ్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :