షూటింగ్ పూర్తి చేసుకున్న అజిత్ “వలిమై”…రిలీజ్ డేట్ కోసం..

Published on Sep 2, 2021 5:42 pm IST

ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న తాజా చిత్రం అజిత్ వలిమై. హెచ్. వినోత్ దర్శకత్వం లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ మరియు బోనీ కపూర్ లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో హుమ ఖురేషీ, కార్తికేయ గుమ్మకొండ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన తాజా అప్డేట్ బయటికి వచ్చింది. ఈ చిత్రం కు సంబంధించిన షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకోవడం తో సినిమా రిలీజ్ డేట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ చిత్రాన్ని ఈ ఏడాది విడుదల చేసే అవకాశాలు ఉన్నప్పటికీ డేట్ పై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కొద్ది రోజుల్లో వెలువడే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :