యాగంటి వెళ్లిన “వాల్మీకి”…!

Published on Jun 13, 2019 12:43 pm IST

వరుణ్ తేజ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ ‘ఎఫ్2’ తరువాత డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో “వాల్మీకి” మూవీ చేస్తున్నారు. కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ తమిళ “జిగర్తాండా”కి అనువాదం. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ప్రముఖ శివక్షేత్రమైన యాగంటిలో జరుపుకుంటుంది. దానికి సంబందించిన ఓ షూటింగ్ షాట్ ఫొటో ని దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘శివుని ఆశీసులలో ఈ అద్భుతమైన ప్రదేశంలో షూటింగ్ మొదలుపెట్టాం’ అని ఆయన ఓ సందేశం కూడా పోస్ట్ చేశారు. ఓ యాక్షన్ సన్నివేశానికి సంబందించిన చిత్రీకరణ కొరకు చిత్ర యూనిట్ యాగంటి వెళ్లినట్టు సమాచారం.

ఈ షెడ్యూల్ లో హీరో వరుణ్ తో పాటు సీనియర్ యాక్టర్ బ్రహ్మాజీ కూడా పాల్గొంటున్నారు.నేడు జరుగుతున్న ఈ షెడ్యూల్ కి కొరకు బయలుదేరిన వరుణ్ కారు నిన్న రాత్రి ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా, ఆచంట రాము, గోపినాథ్ లు 14రీల్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More