రైతులను సన్మానించిన ‘వంశీ పైడిపల్లి’ !

Published on May 28, 2019 9:56 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘మహర్షి’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో మహేశ్ బాబు కెరీర్ లోనే భారీ బ్లాక్ బ్లస్టర్ చిత్రంలా నిలిచింది. పైగా ఇటీవలె వందకోట్ల మార్క్ ని కూడా దాటింది ఈ సినిమా. అయితే ఈ చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి తన సొంత గ్రామమైన ఖానాపూర్‌ లోని లక్ష్మీ థియేటర్‌ ను సందర్శించారు.

కాగా ఖానాపూర్‌ లోని రైతులందరికీ ‘మహర్షి’ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించడం జరిగింది. సినిమాని చూసిన రైతులు ‘మాహర్షి’ అద్భుతంగా ఉందని.. తమ సమస్యలకు సినిమాలో సరైన పరిష్కార మార్గాలను సూచించారని.. నిజంగా ప్రతిఒక్కరూ రైతులను అలా గౌరవిస్తే ప్రతి రైతు ఎంతో సంతృప్తిగా బతుకుతాడని రైతులు అన్నారు.

ఇక ఈ సందర్భంగా చిత్రబృందం రైతులను ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. నా స్వంత ఊర్లో నా చేతుల మీదగా రైతులను సన్మానించడం నాకు చాలా ఆనందాన్ని కలిగించిందని వంశీ తెలిపారు.

సంబంధిత సమాచారం :

More