వంశీ పైడిపల్లి తోనే అఖిల్ రెండో సినిమా..

vamsi-paidipally (1)
నాగార్జున కెరీర్ లోనే ప్రత్యేకంగా ’ఊపిరి’ సినిమా నిలిచిన విషయం తెలిసిందే. మార్చి 25న పెద్ద ఎత్తున విడుదలైన ఈ సినిమా మొదటిరోజునుంచే హిట్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబడుతున్నది. సినిమా ఆద్యంతం బాగా నవ్వించే సన్నివేశాలతో పాటు, మనసును కదిలించే సన్నివేశాలతో రూపొందించిన వంశీ పైడిపల్లి కి ఈ సినిమాతో మంచి సెన్సిబిలిటీస్ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.

’ఊపిరి’ రూపొందించిన వంశీ పైడిపల్లి ప్రతిభను గుర్తించిన నాగార్జున అఖిల్ రెండో సినిమాకు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. నాగార్జున తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో వంశీ పైడిపల్లి అఖిల్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లు పూర్తి స్థాయి రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఓ కథను సిద్ధం చేసినట్లు తెలిసింది. త్వరలో ఈ సినిమా సంబంధించి అన్ని వివరాలు తెలుస్తాయి.

Exit mobile version