క్రికెట్ స్టేడియం లో మహేష్ తో ఆ దర్శకుడు కూడా….!

Published on Jun 9, 2019 3:29 pm IST

ఫ్యామిలీ తో పాటు వరల్డ్ టూర్ ని ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ నేడు జరగనున్న ఇండియా వర్సస్ ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ కి హాజరుకానున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ మ్యాచ్ ని మహేష్ తో కలిసి వీక్షించడానికి మరో సెలెబ్రిటీ జాయిన్ఐయ్యారు. ఆయనెవరో కాదు మహేష్ కి ‘మహర్షి’ వంటి హిట్ మూవీ అందించిన దర్శకుడు వంశీ పైడిపల్లి.

దర్శకుడు వంశీ ,మహేష్ మరియు ఆయన ఫ్యామిలీ తో దిగిన సెల్ఫీ ఫోటో ఒకటి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. బ్లూ కలర్ టి షర్ట్ లో గాగుల్స్ పెట్టుకొని ఉన్న మహేష్ లుక్ సూపర్ గా ఉంది. ఇప్పడు ప్రపంచం అంతా వరల్డ్ కప్ క్రికెట్ ఫీవర్ తో ఊగిపోతోంది. ఇక క్రికెట్ ను, క్రికెటర్స్ ని దేవుళ్ళు లా పూజించే మన దేశంలో అభిమానుల గురించైతే చెప్పనవసరం లేదు. దీనికి సెలెబ్రిటీలు కూడా ఏం మినహాయింపు కాదు. ఇంగ్లాండ్ లో ఓవల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కి విక్టరీ వెంకటేష్ కూడా హాజరు కానున్నారని సమాచారం.

సంబంధిత సమాచారం :

More