సమీక్ష : వనవీర – కొన్నిచోట్ల మాత్రమే ఆకట్టుకునే యాక్షన్ డ్రామా

సమీక్ష : వనవీర – కొన్నిచోట్ల మాత్రమే ఆకట్టుకునే యాక్షన్ డ్రామా

Published on Jan 2, 2026 2:01 AM IST

VanaVeera

విడుదల తేదీ : జనవరి 01, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : అవినాష్ తిరువీధుల, సిమ్రాన్ చౌదరి, శ్రీ నందు, కోన వెంకట్, సత్య, శివాజీ రాజా, ఆమని తదితరులు
దర్శకుడు : అవినాష్ తిరువీధుల
నిర్మాతలు : అవినాష్ బుయాని, ఆలపాటి రాజా, సి అంకిత్ రెడ్డి
సంగీత దర్శకుడు : వివేక్ సాగర్
సినిమాటోగ్రాఫర్ : సుజాత సిద్ధార్థ్
ఎడిటర్ : చోటా కె ప్రసాద్

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

అవినాష్ తిరువీధుల, సిమ్రాన్ చౌదరి జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘వనవీర’ నేడు థియేటర్లలో రిలీజ్ అయిది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

రఘు (అవినాష్ తిరువీధుల) అల్లరిచిల్లరిగా తిరిగే కుర్రాడు. తన మరదలు ఇందు(సిమ్రాన్ చౌదరి)తో ప్రేమలో ఉంటాడు రఘు. ఏదైనా పని చేసుకోవాలని రఘు తండ్రి(శివాజీ రాజా) ఎప్పుడూ చెబుతుంటాడు. కానీ, రఘు ఆయన మాటలను పెడచెవిన పెడతాడు. నవ నిర్మాణ పార్టీ తరఫున దేవ(శ్రీ నందు) ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపికవుతాడు. అయితే, దేవ కార్యకర్తలు ఓ ర్యాలీ కోసం రఘు బైక్‌ని తీసుకెళ్తారు. కానీ దానిని తిరిగి ఇవ్వరు. ఆ తర్వాత ఎలాంటి సమస్యలు తలెత్తాయి..? రఘు తనకు ఎదురైన సమస్యలను ఎలా పరిష్కరించాడు..? అనేది సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలోని కొన్ని కామెడీ సీన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. ప్రేక్షకులను నవ్వించడంలో అవి సక్సెస్ అయ్యాయి. మరీ ఎక్కువ కామెడీ సీన్స్ లేకపోయినా, ఉన్నవాటిలో కొన్ని బాగా నవ్వులు తెప్పించాయి.

సత్యతో వచ్చిన పారడీ ఎపీసోడ్ బాగుంది. దూకుడు, టెంపర్, సింగం, విక్రమ్ సినిమాలను ఇమిటేట్ చేసే సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. విలన్ పాత్రలో శ్రీ నందు ఆకట్టుకున్నాడు. అవినాష్ తిరువీధుల, సిమ్రాన్ చౌదరి తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో చాలా అంశాలు చూపెట్టాలని ప్రయత్నించారు. కానీ, ఏ ఒక్క అంశం కూడా ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోవడం మైనస్. ఓ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

డివోషనల్ కాన్సె్ప్ట్‌ను యాడ్ చేసినా, అది బలవంతం సినిమాలో చూపెట్టినట్లు అనిపిస్తుంది. మెయిన్ ప్లాట్‌కు ఈ అంశం ఏమాత్రం సంబంధం లేదని అనిపిస్తుంది. ఇటీవల డివోషనల్ కాన్సె్ప్ట్‌కు మంచి ఆదరణ లభిస్తుందనే కారణంతోనే ఈ సినిమాలోనూ ఆ పాయింట్ యాడ్ చేసినట్లు ప్రేక్షకులు ఫీల్ అవుతారు. ఓ క్రమంలో పొలిటికల్ డ్రామాగా సాగే ఈ సినిమాలో కులం, అణచివేతకు సంబంధించిన సీన్స్ కూడా ఆకట్టుకోవు.

ఈ చిత్రానికి సంబంధించిన కథ చాలా వీక్‌గా సాగడంతో ఎమోషనల్ సెగ్మెంట్ కూడా పెద్దగా ఆకట్టుకోదు. ఓ పాత్ర మరణించినప్పుడు రావాల్సిన ఎమోషన్స్ ప్రేక్షకులను మెప్పించవు. పాత్రలను బలంగా రాసుకోకపోవడంతో, సీరియస్ సన్నివేశాలను కూడా ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు. చాలా పోర్షన్స్ బోరింగ్‌గా సాగుతాయి.

సాంకేతిక విభాగం :

వివేక్ సాగర్ బీజీఎం బాగుంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లో ఈ బీజీఎం వర్క్ ఎలివేట్ అయింది. సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్‌గా ఉండాల్సింది. చాలా సీన్స్‌ను ట్రిమ్ చేసి ఉంటే బాగుండు అనిపిస్తుంది. విశ్వజిత్ అందించిన కథ, స్క్రీన్ ప్లే పెద్ద ప్రభావం చూపెట్టలేకపోయాయి. దర్శకత్వం కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. కులం అణచివేతకు సంబంధించిన సీన్స్ చాలా తెలుగు సినిమాల్లో కనిపించాయి. ఈ సినిమాలో కొత్తదనం లేకపోవడంతో ఆ సీన్స్ తేలిపోయాయి.

తీర్పు :

ఓవరాల్‌గా చూస్తే, వనవీర సినిమా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చినా, ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. కొన్ని కామెడీ సీన్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాయి. చాలా పోర్షన్స్ బోరింగ్‌గా ఉండటంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి తగ్గుతుంది. హీరోహీరోయిన్లు, శ్రీ నందు తమ పాత్రలతో ఆకట్టుకున్నా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సినిమాకు మైనస్. కమర్షియల్ ఎంటర్‌టైనర్ చిత్రాలను ఇష్టపడేవారిని ఈ సినిమా కొంతవరకే మెప్పిస్తుంది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు