సర్కార్ కు డబ్బింగ్ చెప్పేసిన హీరోయిన్ !
Published on Sep 11, 2018 1:25 am IST


ఇళయదళపతి విజయ్ నటిస్తున్న 62వ చిత్రం ‘సర్కార్’. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా వుంది. దాంట్లో భాగంగా ఈచిత్రంలో ముఖ్య పాత్రలో నటిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఈరోజు తన పాత్ర తాలూకు డబ్బింగ్ పూర్తి చేసింది.

ప్రముఖ దర్శకుడు మురుగదాస్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎఆర్ రహెమాన్ సంగీతం అందిస్తున్న ఈచిత్రంలో విజయ్ కు జోడిగా కీర్తి సురేష్ నటించింది. భారీ బడ్జెట్ తోసన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం దీపావళికి విడుదల కానుంది. ఇక ఈచిత్రం యొక్క టీజర్ విడుదలకు ముహూర్తం కుదిరినట్లు సమాచారం. అతి త్వరలోనే ఈటీజర్ ప్రేక్షుకుల ముందుకు రానుంది. ‘తుపాకి , కత్తి’ చిత్రాల తరువాత విజయ్ , మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం ఫై భారీ అంచనాలు నెలకొన్నాయి.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook