సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో చేస్తున్న భారీ పాన్ వరల్డ్ చిత్రమే వారణాసి. గ్లోబల్ ఆడియెన్స్ కి రీచ్ అయ్యే కంటెంట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా విడుదల విషయంలో మాత్రం ఎలాంటి రాజీ లేదని మేకర్స్ ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నారు.
ఇంకా సినిమా విడుదలకి కేవలం 200 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో అభిమానులు ఇప్పుడు నుంచే ఈ కౌంట్ డౌన్ విషయంలో ఎగ్జైటింగ్ గా ఉన్నారు. బాట్ అకౌంట్ తో వస్తున్న కౌంట్ డౌన్ తో కూడా వీరు ఓ రేంజ్ లో ఎగ్జైట్ అవుతూ తమ రుద్ర, గ్లోబ్ ట్రాటర్ ఆగమనం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్, ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు. అలాగే కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 7, 2027లో గ్రాండ్ గా ఈ సినిమా విడుదల కాబోతోంది.
200
— Vāranāsi Countdown (@VaranasiPremIN) September 17, 2026


