దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు సినిమా ‘వారణాసి’ని హాలీవుడ్ స్థాయిలో నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఇదిలా ఉండగా, ఇటీవల ‘ది కపిల్ శర్మ షో S4’లో కనిపించిన ప్రియాంక, వారణాసి గురించి ఇంతకు ముందు అధికారికంగా వెల్లడించని ఒక కీలకమైన విషయాన్ని చెప్పింది. వారణాసి చిత్రాన్ని రూ. 1,300 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఇది టాలీవుడ్ చిత్రాలలో ఇప్పటివరకు అత్యధిక బడ్జెట్ కాగా, రాజమౌళి కెరీర్లో కూడా ఇదే అతిపెద్ద ప్రాజెక్ట్.
ప్రస్తుతం ఈ చిత్రం అత్యధిక బడ్జెట్తో తెరకెక్కుతున్న భారతీయ చిత్రాలలో రెండవ స్థానంలో ఉంది, అయితే, నితీష్ తివారీ ‘రామాయణం పార్ట్ 1’ రూ. 2,000 కోట్లకు పైగా బడ్జెట్తో రూపొందుతున్నట్లు చెబుతున్నారు. కాగా రాజమౌళి – మహేష్ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉండబోతుంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాకి విజయేంద్రప్రసాద్ కథ, దేవా కట్టా సంభాషణలు అందిస్తున్నారు.


