వర్మ మోసం చేస్తే గుర్తించడానికి గూగుల్ ఉందిగా..!

Published on Jul 7, 2020 10:05 pm IST

బోల్డ్ కంటెంట్ చిత్రాలు వరుసగా విడుదల చేస్తూ కాసులు గడిస్తున్నాడు డైరెక్టర్ వర్మ. మియా మాల్కోవాతో క్లైమాక్స్ చేసిన వర్మ , నేక్‌డ్ చిత్రంలో క్యాస్టూమ్ డిజైనర్ శ్రీ రాపాకను హీరోయిన్‌గా పరిచయం చేశాడు. వర్మ రెండు రోజుల క్రితం అప్సర రాణి అనే మరో కొత్త యువతిని పరిచయం చేసాడు. ఆమెతో థ్రిల్లర్ అనే ఓ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు చెప్పాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఐతే అప్సర రాణిని చూసిన వెంటనే…ఈమెను ఎక్కడో చూశామే అని చాలా మంది ఆలోచించడం మొదలుపెట్టారు. చివరికి ఆమె బియోడేటా బయటకు తీశారు.

ఈ అమ్మడు తెలుగు వారికి బాగా సుపరిచితురాలే. ఈ హీరోయిన్ అసలు పేరు అంకిత మహారాణా. 4 లెటర్స్ , ఉల్లాల్లా ఉల్లాల్లా అనే రెండు తెలుగు సినిమాల్లో నటించింది. ఆ సినిమాలు అంతగా ఆడకపోవడంతో ఎవ్వరికి పెద్దగా ఈమె గుర్తు లేదు. దీనితో వర్మ ఈ హీరోయిన్ ని ట్విట్టర్ ద్వారా అప్సరా రాణిగా పరిచయం చేశాడు. గూగుల్ లో సెర్చ్ చేస్తే ఈమె అసలు పేరు, బయోడేటా బయటపడింది.

సంబంధిత సమాచారం :

More