పవర్ స్టార్ లో ఎన్నికల తరువాత కథ చెవుతాడట.

పవర్ స్టార్ లో ఎన్నికల తరువాత కథ చెవుతాడట.

Published on Jul 9, 2020 12:06 PM IST

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొద్దిరోజుల క్రితం పవర్ స్టార్ అనే టైటిల్ తో ఓ చిత్రం ప్రకటించారు. అలాగే ఆ మూవీలోని హీరోని కూడా పరిచయడం చేయడం జరిగింది. ఇక ఆ హీరోకి ఎవరైనా స్టార్ హీరో పోలికలు ఉంటే అది కేవలం యాదృచ్చికం మాత్రమే అని చెప్పడం విశేషం. ఇక నేడు ఉదయం పవర్ స్టార్ మూవీ ప్రీ లుక్ పంచుకున్న వర్మ, కొద్దిసేపటి క్రితం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరో ఆలోచిస్తూ కూర్చొని ఉన్నారు.

దానితో పాటు వర్మ పోస్టర్ పై ఎన్నికల తరువాత కథ అని, సినిమా దేనిగురించి ఉంటుందో ఓ హింట్ ఇచ్చారు. కొన్నాళ్లుగా వివాదాన్నే పెట్టుబడిగా సినిమాలు తీస్తున్న దర్శకుడు వర్మ, పవర్ స్టార్ మూవీతో మరిన్ని వివాదాలు రేపడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక పవర్ స్టార్ మూవీ ఆర్ జి వి వరల్డ్ థియేటర్ లో విడుదల కానుంది.మర్డర్, వైరస్, 12 ఓ క్లాక్ మరియు థ్రిల్లర్ అనే మరో నాలుగు సినిమాలు ఆయన తెరకెక్కిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు