పబ్లిక్ లో వర్మ ట్రిపుల్ రైడింగ్.

Published on Jul 20, 2019 3:39 pm IST

ముగ్గురు దర్శకులు ఒకే బైక్ పై పబ్లిక్ లో వెళుతూ హైదరాబాద్ రోడ్ల పై సందడి చేశారు. వారిలో ఒకరు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ,కాగా మరొకరు ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి, మరొకరు లక్ష్మీస్ ఎన్టీఆర్ దర్శకుడు అగస్త్య. వీరు ముగ్గురు మాస్ గెట్ అప్స్ లో ఒకే బైక్ పై వెళుతూ ఉంటె గుర్తుపట్టినవారు కొందరు ఫోటోలు తీశారు.

వీరు మూసాపేట్ లోగల శ్రీరాములు థియేటర్లో “ఇస్మార్ట్ శంకర్” సినిమా చూడటానికి వెతున్నట్లు కొద్దిసేపటి క్రితం వర్మ ట్వీట్ చేయడం జరిగింది. వర్మ ఏమి చేసినా వినూత్నంగా ఆలోచిస్తాడు అనడానికి ఇదొక నిదర్శనం. మరి ఇలా ఒకే బైక్ పై ముగ్గురు వెళుతూ సినిమాకి ప్రచారం కల్పిస్తున్నట్లుంది. కానీ సమాజంలో సీలెబ్రిటీ హోదాలో ఉన్న వారు,హెల్మెట్ లేకుండా, త్రిబుల్ రైడింగ్ చేయడం ఒకింత విమర్శలకు దారితీస్తుంది.

సంబంధిత సమాచారం :

X
More