సినిమా హిట్ లేదా ఫ్లాప్స్ తో సంబందం లేకుండా వరుసగా సినిమాలు తీస్తూ, ఎప్పుడూ వార్తల్లో నిలిచే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన సినిమా ‘అనుక్షణం’. ఈ సినిమాని మొట్ట మొదటి సారిగా వేలం పాట(ఆక్షన్) ద్వారా రిలీజ్ చేయనున్నారు. ఈ విషయంలో డిస్ట్రిబ్యూటర్స్ గురించి మరింత క్లారిటీ కోసం ఈ చిత్ర టీం సినిమా విడుదలని వాయిదా వేశారు.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం సెప్టెంబర్ 12న రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్స్ ని కూడా హై లెవల్లో ప్లాన్ చెయ్యడానికి ఈ చిత్ర టీం పళన చేస్తోంది. ‘అమ్మాయిలూ జాగ్రత్త’ అనేది ఈ సినిమాకి ఉపశీర్షిక. ఒక సైకో కిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో మంచు విష్ణు సరసన తేజస్వి నటిస్తుండగా, మధు శాలిని ఓ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది. చాలా రోజుల తర్వాత సీనియర్ నటి రేవతి ఈ సినిమా ద్వారా తెలుగులో కనిపించనుంది.
