ప్రస్తుతం ఓటిటిలో రిలీజ్ కి రాబోతున్న అవైటెడ్ వెబ్ సిరీస్ ఏదన్నా ఉంది అంటే అది స్టార్ హీరోయిన్ సమంత అలాగే బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ కాంబినేషన్ లో యంగ్ దర్శకులు రాజ్ అండ్ డీకే లు తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ వెబ్ సిరీస్ “సిటాడెల్ హనీ బన్నీ” మరికొన్ని రోజుల్లో రాబోతుంది.
అయితే ఈ సిరీస్ కి ముందు టీం అంతా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా కూడా ఉన్నారు. ఇక ఈ బిజీగా ఉన్న సమయంలో వరుణ్ ధావన్ పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది. తమ వెబ్ సిరీస్ నుంచి ఓ స్టిల్ ని షేర్ చేసి దానికి సమంత, నాచురల్ స్టార్ నాని నటించిన “ఈగ” సినిమాలో నేనే నానీనే సాంగ్ తెలుగు వెర్షన్ ని పెట్టి అరె అరె అరే అంటూ పోస్ట్ చేసాడు.
మరి ఈ స్టిల్ లో అయితే ఇద్దరు నడుమ కూడా మంచి కెమిస్ట్రీ కూడా కనిపిస్తుంది. దీనితో వరుణ్ ధావన్ చేసిన ఈ స్పెషల్ పోస్ట్ మంచి వైరల్ గా మారింది. ఇక వీరి కలయికలో వస్తున్న సిరీస్ ఈ నవంబర్ 7 నుంచి అమేజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి రాబోతుంది.
View this post on Instagram