ఇంట్రస్టింగ్ లుక్ తో ఆకట్టుకున్న ‘ఇందువదన’ !

ఇంట్రస్టింగ్ లుక్ తో ఆకట్టుకున్న ‘ఇందువదన’ !

Published on May 3, 2021 11:18 AM IST

indu

వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి ఇందులో జంటగా నటిస్తున్న కొత్త చిత్రం ‘ఇందువదన’. శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై నైనిష్య & సాత్విక్ స‌మ‌ర్ప‌ణ‌లో MSR దర్శకత్వం వ‌హిస్తున్న‌ ఈ సినిమాని, శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్నారు. చాలా ఏళ్ళ తర్వాత ఇందువదన సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తున్నారు వరుణ్ సందేశ్. తాజాగా విడుదలైన ఇందువదన ఫస్ట్ లుక్‌ చాలా కళాత్మకంగా ఉండటంతో అనూహ్యమైన స్పందన వస్తుంది. అందులో వరుణ్ సందేశ్, ఫర్నాజ్ లుక్ కథాపరంగా చాలా అద్భుతంగా డిజైన్ చేసారు దర్శకుడు MSR.

విడుదలైన క్షణం నుంచే ఇందువదన లుక్‌కు మంచి స్పందన వస్తున్నందుకు చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉండటమే కాకుండా,వరుణ్ సందేశ్ కూడా ఇందువదన సినిమా కోసం తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సతీష్ ఆకేటీ అందిస్తుండగా.. శివ కాకాని సంగీతం సమకూరుస్తున్నారు. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు చిత్ర దర్శక నిర్మాతలు తెలియజేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు