పవన్ పార్టీకి మెగా హీరోలు విరాళాలు !

Published on Dec 24, 2018 11:57 pm IST

ఏ రాజకీయ పార్టీకైనా.. ఆ పార్టీ విధేయులు, అభిమానులు విరాళాలు ఇవ్వడం సర్వసాధారణం. ఇక ఈ విషయంలో ప్రస్తుత అన్ని పార్టీల కంటే జనసేనకు విరాళాలు తక్కువ స్థాయిలో అందుతున్నాయి. అందుకేనేమో తాజాగా మెగా హీరోలు విరాళాలు ఇచ్చారు. వరుణ్ తేజ్ కోటి రూపాయలు జనసేన పార్టీకి విరాళం ఇవ్వగా… నాగబాబు 25 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ నే ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ సహాయం తనకు ఒక క్రిస్టమస్ గిఫ్ట్ లాంటిదని, వరుణ్ కు, అన్నయ్య నాగబాబు గారికి కృతజ్ఞతలు అని పవన్ తెలిపారు. ఇక సమయం చూసుకొని తప్పకుండా వారిని కలుస్తాను అని పవన్ పోస్ట్ చేసారు.

సంబంధిత సమాచారం :