వాల్మీకి షూటింగ్ లో జాయిన్ కానున్న వరుణ్ తేజ్ !

Published on Mar 22, 2019 10:00 pm IST

ఇటీవల ఎఫ్ 2 తో సాలిడ్ హిట్ కొట్టి ఫుల్ జోష్ లో వున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్. ఇక ఈ చిత్రం తరువాత ప్రస్తుతం అయన రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు. అందులో ఒకటి ట్యాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ‘వాల్మీకి’. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.

అయితే ఈ సినిమాతో పాటు వరుణ్ ,కిరణ్ కొర్రపాటి తో ఓ సినిమా చేయనున్నాడు. ఇక ఆ చిత్రంలో వరుణ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. దాంతో ఆయన ప్రస్తుతం అమెరికాలో ప్రొఫెషనల్ బాక్సర్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నాడు. కోచింగ్ ముగించుకుని తర్వలోనే ఇండియా రానున్నాడు వరుణ్.

ఏప్రిల్ 16నుండి వరుణ్ వాల్మీకి షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘జిగర్తండా’ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ఫై రామ్ ఆచంట , గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈచిత్రం ఈ ఏడాది చివర్లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :