
వరల్డ్ వార్ II బ్యాక్ డ్రాప్ కి ఓ అందమైన ప్రేమకథని జోడించి చెప్పాలనే ఆలోచన ఎవ్వరూ ఆలోచించరు. ఒకవేళ చేసినా సినిమా చేయడానికి ధైర్యం చేయరు.. ఇప్పుడు అలాంటి ప్రేమకథతో, అదే బ్యాక్ డ్రాప్ లో త్వరలో తెలుగు ఆడియన్స్ ని థ్రిల్ చేయడానికి రానున్న సినిమా ‘కంచె’. మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా విమర్శనాత్మక సినిమాలు చేసిన క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలకు వెళ్లనుందని కొద్ది సేపటి క్రితమే తెలియజేశాం. ఇప్పుడే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
సెన్సార్ బోర్డ్ వారు ఈ సినిమా ‘యు/ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. సెన్సార్ వారు వరల్డ్ వార్ ఎపిసోడ్ చూసి స్టన్ అయిపోయేలా చేసింది. అంతే కాకుండా ఓవరాల్ ఫిల్మ్ అండ్ సినిమా క్వాలిటీ వారిని మెస్మరైజ్ చేసిందని సమాచారం. సెన్సార్ కూడా పూర్తవడంతో ఈ సినిమా కోసం ఓ పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ ని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు.
వరుణ్ తేజ్ నటించిన ఈ రెండవ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. వరుణ్ తేజ్ సరసన ప్రాగ్య జైశ్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ నికేతన్ దీర్ విలన్ గా కనిపించనున్నాడు. 1947 బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ ప్రేమకథ ద్వారా చిరంతన్ భట్ మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు.

