నూతన నటీనటులు హ్రిషికేష్, మాళవికా సతీషన్ మరియు “సవారి” ఫేమ్ ప్రియాంక శర్మ మరో ప్రధానపాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “బొమ్మలకొలువు”. సుబ్బు వేదుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఏవీఆర్ స్వామి నిర్మాణం వహిస్తున్నారు.అలాగే శివమ్ మల్హోత్రా, సుబ్బు వేదుల కీలకపాత్రలలో నటిస్తున్నారు.
రుధ్ర, రాగ, గుణ అనే మూడు పాత్రలచుట్టూ తిరిగే ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సబ్జెక్ట్‌తో ఈ మూవీ తెరకెక్కుతుండగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మెగాహీరో మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ విడుదలచేసి టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈశ్వర్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి పర్విన్ లక్కరాజు సంగీతం అందిస్తుండగా.
ఎంఆర్ వర్మ ఎడిటింగ్ అందిస్తున్నారు. అలాగే స్టంట్స్: రాబిన్ సుబ్బు, లిరిక్స్: శ్రీనివాస మౌళి, పిఆర్ఒ గా వంశీశేఖర్ వ్యవహరిస్తున్నారు.మరి హ్రిషికేష్, మాళవికా సతీషన్, ప్రియాంక శర్మలు ప్రధాన పాత్రలలో నటిస్తుండగా శివమ్ మల్హోత్ర, సుబ్బు వేదుల తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు.


