“ఎఫ్3” టీమ్ తో ఉన్న ఫోటోను షేర్ చేసిన వరుణ్!

Published on Jul 2, 2021 9:16 pm IST


అన్ లాక్ ప్రక్రియ మొదలవ్వడంతో తెలుగు సినీ పరిశ్రమలో షూటింగులు మొదలయ్యాయి. అయితే వరుణ్ తేజ్, వెంకటేష్ దగ్గుబాటి లు హీరో లుగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ఎఫ్2. ఈ చిత్రానికి సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. ఎఫ్ 3 పేరిట ఈ చిత్రం రానుంది. అయితే ఈ చిత్రం షూటింగ్ తాజాగా మొదలైంది. అయితే షూటింగ్ మొదలు కావడం తో సెట్స్ లో మళ్లీ నవ్వులు మొదలయ్యాయి అంటూ చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది. అయితే రీ యూనియన్ అయిన ఫోటోలు ఇప్పుడు చిత్ర యూనిట్ షేర్ చేయడం జరిగింది. అందులో భాగంగా హీరో వరుణ్ తేజ్ ఒక ఫోటోను షేర్ చేశారు. వరుణ్ తేజ్, వెంకటేష్, అనిల్ రావిపూడి, దిల్ రాజు లు కలిసి ఉన్న ఫోటో ను వరుణ్ తేజ్ షేర్ చేశారు.

మళ్ళీ ఈ టీమ్ తో వర్క్ మొదలు కావడం పట్ల వరుణ్ తేజ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ చిత్రం లో మరొక హీరో గా సునీల్ నటిస్తున్నారు. ఈ చిత్రం లో తమన్నా భాటియా, మేహరిన్ కౌర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :