బాక్సర్ గా ఫైటింగ్ మొదలుపెట్టిన మెగాహీరో

Published on Feb 24, 2020 9:34 pm IST

మెగా హీరో వరుణ్ గత ఏడాది గద్దలకొండ గణేష్ చిత్రంతో ఓ హిట్ తన కథలో వేసుకున్నాడు. దర్శకుఢు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఆ చిత్రంలో ఊర మాస్ విలన్ గా అలరించాడు. ఇక ఈ చిత్రం తరువాత వరుణ్ తన 10వ చిత్రంగా స్పోర్ట్స్ డ్రామా అనౌన్స్ చెందారు. ఈ సినిమాలో వరుణ్ ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం వరుణ్ నిపుణుల దగ్గర శిక్షణ తీసుకున్నారు. కాగా నేడు ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది.

నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, అల్లు వెంకట్, సిద్ధు ముద్ద నిర్మిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ ఎవరనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. మెగా అభిమానులలో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

సంబంధిత సమాచారం :

X
More