స్పేస్ ఫిల్మ్ చేయనున్న వరుణ్ తేజ్ !

స్పేస్ ఫిల్మ్ చేయనున్న వరుణ్ తేజ్ !

Published on Feb 9, 2018 1:00 PM IST

యంగ్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘తొలిప్రేమ’ రేపే రిలీజ్ కానుంది. ‘ఫిదా’ సినిమాలో కెరీర్లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అందుకున్న వరుణ్ ఈ లవ్ స్టోరీతో కూడా మెప్పిస్తాడని ప్రేక్షకుల్లో గట్టి నమ్మకముంది. దీని తర్వాత ఈ మెగా హీరో ‘ఘాజి’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు.

ఈ చిత్రం పూర్తిగా అంతరిక్షానికి (స్పేస్) సంబంధించినదై ఉండనుంది. అంతరిక్ష కేంద్రం శ్రీహారి కోట బేస్ నైపథ్యంలో జరిగే ఈ చిత్రాన్ని ‘కంచె’ నిర్మాత రాజీవ్ రెడ్డి నిర్మించనున్నారు. ఎక్కువ శాతం విజువల్ ఎఫెక్ట్స్ ఉండనున్న ఈ సినిమా రాబోయే రెండు నెలల పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకోనుంది. ఇక ఈ చిత్రంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు