తన ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన వరుణ్ తేజ్.. ఏమైందంటే..?

తన ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన వరుణ్ తేజ్.. ఏమైందంటే..?

Published on Apr 18, 2026 8:01 PM IST

Varun-Tej

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన ఆరోగ్యానికి సంబంధించి తాజాగా ఓ అప్డేట్ ఇచ్చాడు. ఆయన ఒక చిన్న శస్త్రచికిత్స చేయించుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఒక లేఖను విడుదల చేశాడు. తన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, మద్దతుగా నిలిచిన అభిమానులకు మరియు శ్రేయోభిలాషులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఇటీవల గాయపడిన వరుణ్ తేజ్ గాయపడ్డ సంగతి తెలిసిందే. అయితే, తన కాలికి జరిగిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని, ప్రస్తుతం తాను కోలుకోవడంపైనే పూర్తి దృష్టి సారించినట్లు వరుణ్ తేజ్ పేర్కొన్నాడు. తనకు చికిత్స అందించిన వైద్యులకు ధన్యవాదాలు తెలియజేశాడు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, రెట్టింపు ఉత్సాహంతో తిరిగి వస్తానని అభిమానులకు భరోసా ఇచ్చాడు.

ఈ అప్‌డేట్‌తో మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో మెసేజ్‌లు వెల్లువెత్తుతున్నాయి.

Varun-Tej

సంబంధిత సమాచారం

తాజా వార్తలు