కార్తికేయ “రాజా విక్రమార్క” టీజర్ ను విడుదల చేయనున్న మెగా ప్రిన్స్ “వరుణ్ తేజ్”

Published on Sep 3, 2021 2:30 pm IST


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రేపు ఉదయం కార్తికేయ హీరోగా నటిస్తున్న రాజ విక్రమార్క టీజర్ ను విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు. ఎన్ఐఎ ఆఫీసర్ గా నటిస్తున్న కార్తికేయ తన రహస్య మిషన్ కి సంబంధించిన విషయం పై మరింత ఆసక్తి పెంచేలా టీజర్ ప్రకటన ఉండటం విశేషం. తాజాగా విడుదల చేసిన పోస్టర్ చాలా ఆసక్తిగా ఉంది. అంతేకాక టీజర్ విడుదల సమయం ను సైతం పోస్టర్ లో ప్రకటించడం జరిగింది.

వరుణ్ తేజ్ రేపు ఉదయం 10:35 గంటలకు ఏజెంట్ రాజా విక్రమార్క టీజర్ ను విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి శ్రీ సరిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం తో తన్య రవి చంద్రన్ తెలుగు సినీ పరిశ్రమలో కి అడుగు పెడుతోంది. ఆది రెడ్డి టి సమర్పణ లో వస్తున్న ఈ చిత్రానికి 88 రామారెడ్డి నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటుంది. త్వరలో ఇందుకు సంబంధించిన మరిన్ని విషయాలు వెలువడే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :