లావణ్య త్రిపాఠి ని విష్ చేసిన వరుణ్ తేజ్ !

Published on Dec 16, 2018 2:07 am IST

మెగా హీరో వరుణ్ తేజ్ ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ‘అంతరిక్షం 9000 కెఎమ్ పిహెచ్’ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రోజు లావణ్య త్రిపాఠి బర్త్ డే. వరుణ్ తేజ్ లావణ్యకు ట్విట్టర్ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. నువ్వెప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలని తెలిపారు.

ఈ స్పెస్ థ్రిల్లర్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఇక ఇటీవల విడుదలైన టీజర్ , ట్రైలర్ ప్రామిసింగ్ గా వుండడం అలాగే తెలుగులో వస్తున్న మొదటి స్పేస్ థ్రిల్లర్ కావడంతో ఈ చిత్రం ఫై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.

జ్ఞానశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైనెంట్ పతాకం ఫై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తోన్నారు. ఈ చిత్రం డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :