బాక్సర్ కోసం వరుణ్ కొత్త క్యారెక్టరైజేషన్ ?

Published on Apr 8, 2020 2:00 am IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తర్వాతి సినిమాను బాక్సింగ్ నేపథ్యంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం వరుణ్ ప్రత్యేకంగా బాక్సింగ్ శిక్షణ తీసుకున్నారు. ఈ సినిమాని కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో వరుణ్ తేజ్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుందట.. పైగా వెరీ అగ్రెసీవ్ క్యారెక్టర్ అట. అన్నట్టు ఈ సినిమాలో వరుణ్ సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నాడు.

ఇక ఈ చిత్రం కోసం నిర్మాతలు అల్లు బాబీ, సిద్దు ముద్దలు దాదాపు రూ.35 కోట్ల వరకు ఖర్చు పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం వరుణ్ బరువు తగ్గి ఫిట్ లుక్ తెచ్చుకున్నారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుందని సమాచారం. ఇకపోతే మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిచనున్నారు.

సంబంధిత సమాచారం :

X
More