గేమ్ మొదలుపెట్టనున్న మెగా ప్రిన్స్

Published on Feb 24, 2020 11:10 am IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తర్వాతి సినిమాను బాక్సింగ్ నేపథ్యంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం వరుణ్ ప్రత్యేకంగా బాక్సింగ్ శిక్షణ తీసుకున్నారు. ఈ సినిమాని కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తున్నారు. ప్రీప్రొడక్షన్ పూర్తి కావడంతో ఈరోజు నుండి రెగ్యులర్ షూట్ వైజాగ్లో మొదలుకానుంది. ఇప్పటికే వరుణ్ తేజ్ వైజాగ్ చేరుకున్నారు.

ఈ చిత్రం కోసం నిర్మాతలు అల్లు బాబీ, సిద్దు ముద్దలు దాదాపు రూ.35 కోట్ల వరకు ఖర్చు పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం వరుణ్ బరువు తగ్గి ఫిట్ లుక్ తెచ్చుకున్నారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుందని సమాచారం. ఇకపోతే మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిచనున్నారు. వరుణ్ తేజ్ వరుస విజయాలతో దూసుకుపోతుండటంతో ఈ కొత్త సినిమాపై ప్రేక్షకుల్లో, మెగా అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.

సంబంధిత సమాచారం :

X
More