యువ హీరోలు నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్ బాబు, కలయికలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ ‘వీర భోగ వసంత రాయలు’ చిత్రం. నూతన దర్శకుడు ఇంద్రసేన. ఆర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ శ్రీయ ముఖ్య పాత్రలో నటిస్తుండటం విశేషం. కాగా వైవిధ్యంమైన కథ కథనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎవరు ఊహించని విధంగా డిఫరెంట్ గా ఉంటుందట. ఈ ప్రయోగాత్మకమైన చిత్రం తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తోందని తెలుస్తోంది.
తాజాగా ‘వీర భోగ వసంతరాయలు’ చిత్రం విడుదల తేదీని పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. అక్టోబర్ 26న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవ్వనుంది. అయితే అక్టోబర్ 5న విడుదల అవుతుందని గతంలో ప్రకటించినప్పటికీ కొన్ని కారణాల వల్ల, అక్టోబర్ 26న ఈ చిత్రం విడుదల అవ్వనుంది.
కాగా క్రైమ్ డ్రామాగా థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి మార్క్ కే రాబిన్ సంగీతం సమకూరుస్తుండగా, బాబా క్రియేషన్స్ పతాకంపై, ఎంవికె రెడ్డి గారి సమర్పణలో అప్పారావు బెల్లాన నిర్మిస్తున్నారు.


