అవెంజర్స్ ఎండ్ గేమ్ లేటెస్ట్ ఇండియా కలెక్షన్స్ !

Published on May 2, 2019 6:50 pm IST

అవెంజర్స్ సిరీస్ లో చివరి చిత్రంగా వచ్చిన అవెంజర్స్ ఎండ్ గేమ్ ఇండియాలో మంచి వసూళ్లను రాబడుతుంది. వీక్ డేస్ లో కూడా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హావ కొనసాగిస్తుంది. ముఖ్యంగా ఈ చిత్రానికి వేరే చిత్రాలతో పోటీ లేకపోవడం బాగా కలిసొచ్చింది. ఇక నిన్న మేడే హాలీడే కావడంతో ఈ చిత్రం 28. 50 కోట్ల వసూళ్లను రాబట్టింది. కాగా మొత్తం 6 రోజుల్లో ఈ చిత్రం ఇండియాలో 244.30 కోట్ల వసూళ్లను రాబట్టిందని సమాచారం. దాంతో ఈ చిత్రం ఇండియాలో ఈ ఈఏడాది హైయెస్ట్ గ్రాసర్ ను రాబట్టిన చిత్రంగా గా రికార్డు క్రియేట్ చేసింది.

ఇంతకుముందు బాలీవుడ్ మూవీ యూరి ది సర్జికల్ స్ట్రైక్ 240 కోట్ల గ్రాస్ ను రాబట్టి మొదటి స్థానంలో ఉండగా తాజాగా ఈ అవెంజర్స్ ఎండ్ గేమ్ ఆ రికార్డు ను బ్రేక్ చేసింది. ఇక ఫుల్ రన్ లో ఈ చిత్రం ఇండియా లో 300 కోట్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :

More