వైరల్ అవుతున్న మామ అల్లుళ్ళ రేర్ ఫోటో..!

Published on Dec 13, 2019 12:14 pm IST

విక్టరీ వెంకటేష్ అభిమానులకు నేడు రెండు పండుగలు. ఒకటి తమ అభిమాన హీరో పుట్టినరోజు కావడం రెండు అదే రోజు ఆయన తన మేనల్లుడు నాగ చైతన్య తో చేసిన వెంకీ మామ మూవీ విడుదల కావడం. లెజెండరీ నిర్మాత స్వర్గీయ రామానాయుడు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన వెంకీ మామ చిత్రంపై పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. దర్శకుడు కె ఎస్ రవీంద్ర అన్ని ఎలిమెంట్స్ కలిగిన పక్కా కమర్షియల్ మూవీగా తెరకెక్కించినట్లు సమాచారం. మూవీలో మామ అల్లుళ్ళ సరదా సన్నివేశాలతో పాటు, కంటతడి పెట్టించే ఎమోషన్స్ కూడా ఉంటాయని చిత్ర యూనిట్ చెప్పడం జరిగింది.

కాగా వెంకీ మామ విడుదల నేపథ్యంలో వెంకటేష్, నాగ చైతన్యల పాత ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏడెనిమిదేళ్ల వయసులో ఉన్న చైతూని వెంకటేష్ కౌగిలించుకొని ఉన్న ఆ త్రోబ్యాక్ పిక్ మామ అల్లుళ్ళ మధ్య చిన్నప్పటినుండీ ఉన్న బాండింగ్ తెలియజేసేదిలా ఉంది. నిన్న పాత్రికేయుల సమావేశంలో వెంకీ నాకళ్ళ ముందు పెరిగిన క్యూట్ కిడ్ నా పక్కన హీరోగా చేయడం ఆశ్యర్యంగా ఉంది అన్నారు. ఇక వెంకీ మామ చిత్రంలో పాయల్ రాజ్ పుత్, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తుండగా, సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించాయి. థమన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :

More