హాలీవుడ్ మూవీలో ‘వెంకీ టైమింగే’ హైలెట్ !

Published on May 15, 2019 6:25 pm IST

ఇప్పటి అగ్రకథానాయకుల్లో డైలాగ్ ను సరైన టైమింగ్ తో కామెడీ పండేలా పలకడంలో వెంకటేష్ కు వెంకటేషే సాటి అని చెప్పాలి. కేవలం తన క్యారెక్టరైజేషన్ కి తగ్గట్లు, డైలాగ్ కి అనుగుణంగా తన టైమింగ్‌ మారుస్తూ.. వాయిస్ లో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతుంటారు వెంకీ. కాగా ఈ నెల 24వ తేదీన రాబోతున్న ‘అలాద్దీన్‌’ తెలుగు వెర్షన్ లో జీని పాత్రకు వెంకీ డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే సినిమా మొత్తంలోనే వెంకీ మాడ్యులేషన్ టైమింగే హైలెట్ కాబోతుందని తెలుస్తోంది. వెంకీ కాకుండా ఇంకా ఎవరూ డబ్బింగ్ చెప్పినా ఇంత బాగా రాదు అంటున్నారు.

ముఖ్యంగా వెంకటేష్ నుంచి ఆయన అభిమానులు మరియు ప్రేక్షకులు ఎలాంటి కామెడీ కోరుకుంటున్నారో ఈ డబ్బింగ్ సినిమాలో ఆ టైపు కామెడీ బాగా వర్కౌట్ అయిందట. వెంకటేష్ తన కామెడీ టైమింగ్‌ తో మాడ్యులేషన్ తో మరోసారి ఈ సినిమాకే హైలెట్ గా నిలిచారట. మళ్లీ మనకు ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ ‘ఎఫ్ 2’ వంటి చిత్రాల్లోని తన డైలాగ్ కామెడీని వెంకీ గుర్తుకు తెస్తారని తెలుస్తోంది.

కాగా ఈ మ్యూజిక‌ల్‌ ఫ్యాంట‌సీ అమెరిక‌న్ చిత్రం అయిన ‘అలాద్దీన్‌’ డైరెక్ట‌ర్ ‘గాయ్‌ రిట్చయ్‌’ దర్శకత్వంలో వస్తోంది. ఇక ఈ చిత్రంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్‌ జీనీగా కనిపించనున్నాడు. అలాద్దీన్‌ గా మేనే మసూద్‌ నటిస్తుండగా.. ప్రిన్స్‌ జాస్మిన్‌ గా నయోమి స్కాట్‌ కనిపించనుంది. కాగా ఈనెల 24వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.

జీని పాత్రకు వెంకీ డబ్బింగ్ చెప్పగా..అలాద్దీన్‌ పాత్రకు వరుణ్‌ తేజ్‌ వాయిస్‌ ఓవర్ అందించాడు. ఇప్పటికే విడుదలైన అలాద్దీన్ తెలుగు ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’ కోసం ప్రపంచ సినీ అభిమానులు ఎంతగా ఎదురుచూశారో.. ఇప్పుడు అలాద్దీన్ చిత్రం కోసం కూడా ఆ స్థాయిలోనే ప్రపంచ సినీ లోకం ఎదురు చూస్తూ ఉంది.

మొత్తానికి ‘అలాద్దీన్’ క్రేజ్ చూస్తుంటే.. కొన్ని ఏరియాల్లో ‘ఎవెంజ‌ర్స్’ ఎండ్ గేమ్ ను బీట్ చేసేలానే ఉన్నాడు. మరి ప్రపంచంలోనే అత్యధిక కలెక్షన్స్ ను రాబట్టడంలో ‘ఎవెంజర్స్’ నెలకొల్పిన సరికొత్త బాక్సాఫీస్ రికార్డ్స్ ను.. ‘అలాద్దీన్’ ఏ మేరకు బద్దలుకొట్టి.. కొత్త రికార్డ్స్ ను నెలకొల్పుతాడో చూడాలి.

సంబంధిత సమాచారం :

More