వెంకీతో వినాయక్.. నిజమేనా ?

Published on Jan 1, 2019 9:55 am IST

నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా వి.వి వినాయక్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ ఓ చిత్రాన్ని నిర్మించటానికి ముమ్మరంగా ప్రయత్నం చేస్తోన్న విషయం తెలిసిందే. కాగా తాజా సమాచారం ప్రకారం ఆ సినిమా ఇప్పట్లో సాధ్యం కాదని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే బాలయ్య వినాయక్ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టాడు. తన తదుపరి సినిమాని బోయపాటితో బాలయ్య ఫిక్స్ చేశాడు.

దాంతో వినాయక్ ఇంకో హీరోని పట్టుకున్నాడు. వినాయక్ కథని వెంకటేష్ ఓకే చేశాడు. గతంలో వెంకటేష్ తో కలిసి ‘లక్ష్మి’ సినిమాను రూపొందించాడు వినాయక్. ఈ సినిమా పెద్ద సక్సెస్ అందుకుంది. మళ్లీ ఇంతకాలానికి ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. మరి ఈసారి వెంకీకి వినాయక్ ఎలాంటి సక్సెస్ ఇస్తాడో చూడాలి!

సంబంధిత సమాచారం :

X
More