వెంకటేష్ చాలా అగ్రెసివ్ గా కనిపిస్తున్నాడు !

venky
విక్టరీ వెంకటేష్ తాజాగా చేస్తున్న చిత్రం ‘గురు’. సూపర్ హిట్ హిందీ చిత్రం ‘సాలా ఖదూస్’ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్టే ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ జనవరి నెలలో చిరు, బాలయ్య, నాగార్జున వంటి స్టార్ హీరోలంతా తమ సినిమాలతో ఎదో ఒక విధంగా సందడి చేస్తుంటే వెంకటేష్ కూడా తన గురు టీజర్ ను ఈరోజే రిలీజ్ చేశారు.

ఈ టీజర్లో రిటైర్డ్ బాక్సింగ్ కోచ్ గా కనిపిస్తున్న వెంకటేష్ లుక్స్ తో పాటు బాడీ లాంగ్వేజ్ కూడా పూర్తిగా మార్చేశారు. ఇన్నాళ్లు పోస్టర్లలోనే అగ్రెసివ్ గా కనిపించిన ఆయన ఇప్పుడు టీజర్లో కూడా అలాగే కనిపిస్తున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే ఊహించిన దానికంటే ఎక్కువ అగ్రెసివ్ గానే ఉన్నారు. ఒక ఫ్రస్టేటెడ్, టాలెంటెడ్ అండ్ టఫ్ బాక్సింగ్ కోచ్ ఎలా ఉంటాడో అలానే కనిపిస్తున్నాడు. ఈ ట్రైలర్ చూస్తే సినిమాపై ఆసక్తి మరింతగా పెరుగుతోంది. ఈ టీజర్ ను ఈరోజు నుండి ఖైదీ ప్రదర్శితమయ్యే థియేటర్లలో, రేపటి నుండి శాతకర్ణి ప్రదర్శితమయ్యే స్క్రీన్స్ లో ప్లే చేయనున్నారని సమాచారం.

టీజర్ కోసం క్లిక్ చేయండి: