మామ అల్లుళ్ల కాంబినేషన్ బాగానే రాబడుతోంది

Published on Dec 15, 2019 8:15 pm IST

బాబీ డైరెక్షన్లో వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి చేసిన చిత్రం ‘వెంకీ మామ’. మామ అల్లుళ్లు కలిసి చేసినందువల్ల మొదటి నుండి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాల మూలంగానే సినిమా మొదటి రెండు రోజులు వసూళ్లు చాలా బాగున్నాయి. బాక్స్ ఆఫీస్ ముందు మామ అల్లుళ్ల కాంబినేషన్ బాగా వర్కవుట్ అయింది.

అటు దగ్గుబాటి ఫ్యాన్స్ ఇటు అక్కినేని ఫ్యాన్స్ ఇద్దరూ చిత్రాన్ని చక్కగా ఆదరిస్తున్నారు. తొలిరోజు ఇరు తెలుగు రాష్ట్రాల్లో రూ.7.02 కోట్లు కలెక్ట్ చేసిన చిత్రం రెండో రోజు కూడా అదే స్థాయిలో ప్రభావం చూపింది. సెకండ్ డే రూ.5 కోట్ల షేర్ రాబట్టుకుంది. ఇలా మొత్తంగా రెండు రోజులకు కలిపి రూ.10 కోట్లకు పైగా షేర్ ఖాతాలో వేసుకుంది. ఇక ఈరోజు కూడా ఆదివారం మార్నింగ్ షోలు కూడా చాలా వరకు ఫుల్ అయినట్టు తెలుస్తోంది. సో.. ఆదివారం కూడా కలెక్షన్స్ బాగుండనున్నాయి.

సంబంధిత సమాచారం :

X
More